KNR: భారతీయ జనతా యువమోర్చా వీణవంక మండల అధ్యక్షుడిగా గుండు హరికృష్ణను నియామకం చేసినట్లు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. హరికృష్ణ మాట్లాడుతూ.. భారతదేశంలోని అతిపెద్ద యువజన రాజకీయ విభాగమైన బీజేవైఎం సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా, మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.