SRD: సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యుత్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు గురువారం మద్దతు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్ మాట్లాడుతూ.. ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.