తమిళ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ తన 56వ మూవీని చేయనున్నాడు. తొలుత హీరోయిన్గా కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు వినిపించినా, డేట్స్ సర్దుబాటు కాక ఆమె తప్పుకున్నట్లు సమాచారం. దీంతో హీరోయిన్ పాత్ర కోసం ‘ధురంధర్’ చిత్రంతో నేషనల్ వైడ్ బ్లాక్బస్టర్ అందుకున్న సారా అర్జున్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.