SRPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు నాగారం సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ విన్నూత్న రీతిలో ఆలోచన చేశారు. బుధవారం ఫణిగిరి గ్రామ సర్పంచ్ ఆద్వర్యంలో పాలకవర్గం సహకారంతో ‘హెల్మెట్ లేనిదే ఊరులోకి ప్రవేశం లేదంటూ’ ప్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరేలా ఉండాలి అని అన్నారు.