• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మహిళలను మనుషులుగా గుర్తించి గౌరవించాలి’

KRNL: మహిళలను తల్లి, చెల్లె, కుమార్తె అనే భావంతో మాత్రమే కాకుండా, వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించాలని టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సూచించారు. మంత్రాలయంలో మహిళా దినోత్సవాన్ని MPDO కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచి మనుషులుగా మారాలన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలని సంకల్పించుకోవాలన్నారు.

March 8, 2026 / 02:40 PM IST

‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలి’

SRPT: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘటితంగా ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు భయ్యం జయమ్మ, సర్పంచ్ సంధ్య అన్నారు. ఆదివారం నాగారం మండలం డి. కొత్తపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం శ్రామిక వర్గ మహిళలపై పని భారాన్ని మోపుతూ శ్రమ దోపిడీ చేస్తుందని విమర్శించారు.

March 8, 2026 / 02:40 PM IST

వందే భారత్ రైళ్ల సమయ వేళల్లో మార్పు

ATP: గుంతకల్లు రైల్వే డివిజన్‌లో యశ్వంతపూర్- కాచిగూడ, మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సమయ వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత పూర్- కాచిగూడ మధ్య నడిచే రైలు మధ్యాహ్నం 3.45 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

March 8, 2026 / 02:40 PM IST

‘చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి’

కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

March 8, 2026 / 02:39 PM IST

పోగొట్టుకున్న నగలు తిరిగి అప్పగించిన పోలీసులు

కడప జిల్లాలో బస్సులో పోగొట్టుకున్న రూ.10 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలను గంగిరెడ్డిపల్లి ఎస్సై కృష్ణయ్య, సిబ్బంది వెతికి బాధితురాలు జ్యోతికి సురక్షితంగా అప్పగించారు. వీరపునాయనిపల్లి నుంచి వేంపల్లికి ప్రయాణించే సమయంలో పర్స్ మిస్ కావడంతో ఫిర్యాదు చేయగా బస్సును ఆపించి సీట్ల క్రింద వెతికగా పర్స్ లభించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

March 8, 2026 / 02:38 PM IST

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది: బండి సంజయ్

TG: మెదక్ జిల్లా కౌడిపల్లిలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా తునికిలో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని హితవు పలికారు. రైతు అభివృద్ధి కోసం తాము ఎంతగానో కృష్టి చేస్తున్నామని చెప్పారు.

March 8, 2026 / 02:37 PM IST

కాలువలో పూడికతీత పనులు ప్రారంభం

PDPL: ముత్తారంమండలం మచ్చుపేట గ్రామ పరిధిలోని 9L కాలువలో పేరుకుపోయిన పూడికతీత పనులు చేపట్టారు. కొంతకాలంగా మట్టి, చెత్త పేరుకుపోవడంతో దిగువ ప్రాంత రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించిన సర్పంచ్ చిలివేరి జ్యోతి, జేసీబీ సహాయంతో కాలువను శుభ్రం చేయించి నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేశారు.

March 8, 2026 / 02:37 PM IST

బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్

NZB: HPV వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనదని, దాన్ని తీసుకోవడం వల్ల 95% వరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను నిరోధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురి కాకుండా జిల్లాలో 14 ఏళ్ల వయస్సు కలిగిన 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్‌లో వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదుతో కూడుకున్నదని తెలిపారు.

March 8, 2026 / 02:36 PM IST

MVP కాలనీ గర్ల్స్ హాస్టల్‌ పరిశీలన

VSP: MVP కాలనీలోని గర్ల్స్ గవర్నమెంట్ హాస్టల్‌ను బాలల హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ కాంగు శుభ శర్మ, జిల్లా కో-కన్వీనర్లు ఎరాజీ, పాటి చంద్రశేఖర్, రీమల గంగాధర్ ఆదివారం సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిమాణంతో పాటు వంటశాల, వసతి పరిసరాలు, వంట పాత్రలు, త్రాగునీటి ట్యాంక్‌ను పరిశీలించారు. వంట పాత్రలు శుభ్రంగా ఉంచాల‌ని తెలిపారు.

March 8, 2026 / 02:34 PM IST

మండల సర్వసభ్య సమావేశం వాయిదా.!

VZM: మెరకముడిదాం మండలం సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీవో భాస్కరరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకి సమావేశానికి సరిపడే సభ్యులు లేనందున గంట వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభించినప్పటికీ 16 మంది సభ్యులకు 4 నలుగురు హాజరు కాగా, మిగతా సభ్యులు లేనందున (పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం కోరం లేనందున) సమావేశాన్ని ఎంపీడీవో వాయిదా వేశారు.

March 8, 2026 / 02:33 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్: ఎమ్మెల్యే

SRPT: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి 80కి పైగా అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

March 8, 2026 / 02:33 PM IST

‘అప్రమత్తతోనే అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యం’

JGL: అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యం అవుతుందని, మెట్‌పల్లి అగ్నిమాపక శాఖ అధికారి మధు సూచించారు. మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల నివారణపై మెట్‌పల్లి అగ్నిమాపక కేంద్రం అధికారులు అవగాహన కల్పించారు. అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలను నివారించవచ్చని తెలిపారు.

March 8, 2026 / 02:32 PM IST

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని 10వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ పథకం ద్వారా అనేక కుటుంబాల్లో సొంతింటి వెలుగులు నిండుతున్నాయన్నారు.

March 8, 2026 / 02:32 PM IST

యూరియా యాప్‌లో జీరో స్టాక్

KMR: రాజంపేటలో యూరియా సరఫరాపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో ప్రతిరోజూ జీరో స్టాక్ మాత్రమే కనిపిస్తోందని రైతులు అధికారులను ప్రశ్నించగా.. ముందుగా అప్లై చేసుకున్నారని అధికారులు సమాధానం చెబుతున్నారు. యాప్ ద్వారా ముందుగానే అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు. యూరియా సాధారణ రైతులకు కాకుండా కొంతమంది నాయకులకు మాత్రమే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 8, 2026 / 02:31 PM IST

‘నాన్ లివింగ్ సిటీగా హైదరాబాద్ మారే ప్రమాదం’

TG: HYDలో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని CM రేవంత్ తెలిపారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా? తొలగింపులు వద్దంటున్నారా? అని నిలదీశారు. కాలుష్యంతో హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందన్నారు.

March 8, 2026 / 02:31 PM IST