RR: సంత్ శిరోమణి భగత్ గురు రావిదాస్ మహారాజ్ జయంతి సందర్భంగా పి.జే.ఆర్ నగర్‌లో కమిటీ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రావిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. మహారాజ్ చేసిన సామాజిక సంస్కరణలు, ఆధ్యాత్మిక సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్‌లో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష, DMHO నరేందర్ రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
KMM: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. కౌమార దశలోని బాలికలకు ఈ టీకా ఇవ్వడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా ఉచితంగా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
అన్నమయ్య: గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని తెలిపారు.
‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ హాసన్ అందుకున్న పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కేవలం 10 రోజుల కాల్‌షీట్స్ కేటాయించినందుకు గాను నిర్మాత అశ్వినీదత్ ఆయనకు రూ. 150 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు రూ. 15 కోట్లు అన్నమాట. భారతీయ సినీ చరిత్రలో ఒక సీనియర్ హీరో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే మొదటిసారి అని సినీవర్గాలు చెబుతున్నాయి.
AP: రాష్ట్రంలో జనాభా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని CM చంద్రబాబు అన్నారు. ‘జనాభా పెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం. మహిళలు స్వయం బ్రాండ్ మీదే ఉత్పత్తులు తయారు చేయాలి. అవే ఉపయోగించాలి. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తా. మీ ఆలోచనలతో ఈ బ్రాండ్‌ను మరింత అభివృద్ధి చేయాలి’ అని సూచించారు.
JN: జపర్‌గడ్ మండల కేంద్రంలో ఆదివారం GMPS మండల కమిటీ ఆధ్వర్యంలో గొర్రెల, మేకల పెంపకదారులతో సమావేశం నిర్వహించారు. GMPS జిల్లా ఉపాధ్యక్షుడు బీరయ్య మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల్లో ఆంత్రాక్స్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడంతో పెంపకందారులు తీవ్ర ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
TPT: సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జరుగనుందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని తెలిపారు. అర్జీలు Meekosam.ap.gov.in లోనూ నమోదు చేసుకోవచ్చు, లేదా 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SRD: సెర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం HPV వ్యాక్సిన్ పనిచేస్తుందని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల వయసున్న ఆడ పిల్లలందరూ ఈ వాక్సిన్ తీసుకోవాలన్నారు.
MHBD: తొర్రూరులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు.
E.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మహిళలు ఆర్ధికంగా ఎదగాలన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని, తద్వారా ఆ కుటుంబం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
MDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లాలో మహిళామణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో, దేశాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అపూర్వమని ఆయన కొనియాడారు. విద్య, రాజకీయాలు, శాస్త్రసాంకేతిక, క్రీడా రంగాల్లో మహిళలు తమ ప్రతిభతో దేశ ప్రగతిలో కీలక భాగస్వాములవుతున్నారన్నారు.
అన్నమయ్య: పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా జిల్లా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా SP ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు మహిళల భద్రత కోసం ‘శక్తి టీమ్స్’, దొంగతనాల నివారణకు ప్రత్యేక క్రైమ్ టీమ్స్‌ను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.
BDK: ఇల్లందు మున్సిపాలిటిలో పద్మశాలి సంఘ భవనం ఫ్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పాల్గొన్నారు. మన జాతి మనుగడకు, మన హక్కుల సాధనకు మనందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇంత బ్రహ్మాండంగా కుల సంఘం భవనం నిర్మించడం అభినందనీయం అని అన్నారు. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షించారు.
WNP: మహిళలకు భారతదేశంలో ఉన్న గౌరవం ప్రపంచంలో ఎక్కడా లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం వనపర్తి జిల్లాలోని ఎన్టీఎం లా కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. మహిళా శక్తి సమాజ అభివృద్ధికి మూలాధారం అని అన్నారు.