NZB: బోధన్ శివారులోని సేవాలాల్ జయంతి వేడుకలో ఆదివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పద్మ పాల్గొన్నారు. బంజారాలతో కలిసి వారు ఉత్సాహంగా ఆడిపాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, బంజారాలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
MDK: మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమని అన్నారు. రామాయంపేట సీఐటీయు కార్యాలయంలో ఆదివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. మహిళల హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
KDP: ఖాజీపేట మండలంలోని తవ్వారిపల్లె గ్రామానికి చెందిన చిట్టిబోయిన సుబ్బరాయుడు, చాలగాండ్ల సుబ్బరాయుడు, శంకర, రత్నాకరలకు చెందిన 60 గొర్రెలు ఇవాళ తెల్లవారుజామున కుక్కల దాడిలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన గొర్రెల విలువ లక్షల్లో ఉందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం కుక్కల బెడదను తగ్గించి, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ప్రకాశం: పొదిలి ప్రధాన రహదారిలోని మహా లక్ష్మమ్మ అరుగు వద్ద ఆగి ఉన్న బైక్‌ను మరో బైక్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆగి ఉన్న బైక్‌పై ఉన్న తండ్రీకూతురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లు స్థానికులు తెలిపారు.
అన్నమయ్య: కురబలకోట మండలం ముదివేడు జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెడ్డివారిపల్లిలోని సునీత-జగదీశ్ ఇంటికి జాతర నిమిత్తం వచ్చిన బంధువులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో పుంగనూరు మండలం చదళ్ల గొల్లపల్లికి చెందిన పద్మావతి (50), చిత్తూరు కొంగారెడ్డిపల్లికి చెందిన వెంకటేష్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలిక తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
BDK: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తుందని అయన పేర్కొన్నారు. యుక్త వయస్సు బాలికలకు ఎమ్మెల్యే స్వయంగా టీకాలు అందజేసి అవగాహన కల్పించారు.
JGL: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్ లత, వార్డు అధికారులు శృతి, లయ, సౌమ్య, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
W.G: తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశానికి అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు. 9వ తరగతి నుంచి 22 మంది, 6వ తరగతి 8మంది ఎంపికైనట్లు వివరించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను వారు కలిశారు.
T20 WC ఫైనల్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఫైనల్‌లో భారత్ ఆడనుండటంతో అహ్మదాబాద్ స్టేడియం క్రీడా అభిమానులతో సందడిగా మారింది. ఈ మ్యాచ్‌కి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాలను నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నకిరేకల్‌లోని డీటీఎఫ్ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం శ్రామిక మహిళల సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య-శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి వారిని సన్మానించారు.
TG: గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500 కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని CM రేవంత్ మండిపడ్డారు. గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు చేస్తున్నామని.. గాంధీ విగ్రహం దగ్గర విజ్ఞాన కేంద్రానికి రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ మాత్రమే కాదని.. అవకాశాలు కూడా ఇస్తామన్నారు. నెట్టింటిలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
AP: మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గత పాలకులు బ్లేడ్ బ్యాచ్, గంజాయ్ బ్యాచ్‌లను తయారు చేశారు. అలాంటి వాళ్ల ఆటలు సాగనివ్వను. 30 ఏళ్ల క్రితం నేను హెరిటేజ్ కంపెనీ స్థాపించాను. నా భార్య, కోడలిని పారిశ్రామికవేత్తలుగా మార్చాను. ప్రతి ఇంట్లోని మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది నా ఆలోచన’ అని ఆయన పేర్కొన్నారు.
MNCL: జైపూర్ మండలం వేలాలకి చెందిన బండి నర్సయ్య అనే రైతు పొలం పనులకు వెళ్లగా ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలకు తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యగా భీమారం 108 సిబ్బంది ఈఎంటి రమేశ్, పైలట్ సిరాజోద్దీన్ అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NRML: వడ్డెర కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావుకు ఆ సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మహిళా కానిస్టేబుల్స్‌కి ఎస్సై లక్ష్మారెడ్డి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలలో మహిళలు ముందుకు నడవాలని తెలిపారు. అలాగే జిల్లాలో మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.