అన్నమయ్య: పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా జిల్లా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా SP ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు మహిళల భద్రత కోసం ‘శక్తి టీమ్స్’, దొంగతనాల నివారణకు ప్రత్యేక క్రైమ్ టీమ్స్‌ను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.
BDK: ఇల్లందు మున్సిపాలిటిలో పద్మశాలి సంఘ భవనం ఫ్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పాల్గొన్నారు. మన జాతి మనుగడకు, మన హక్కుల సాధనకు మనందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇంత బ్రహ్మాండంగా కుల సంఘం భవనం నిర్మించడం అభినందనీయం అని అన్నారు. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షించారు.
WNP: మహిళలకు భారతదేశంలో ఉన్న గౌరవం ప్రపంచంలో ఎక్కడా లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం వనపర్తి జిల్లాలోని ఎన్టీఎం లా కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. మహిళా శక్తి సమాజ అభివృద్ధికి మూలాధారం అని అన్నారు.
అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో మహిళా వాకథాన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మిషన్ కాంపౌండ్ వద్ద ర్యాలీని ప్రారంభించి మహిళలతో కలిసి నడిచారు. అనంతరం జరిగిన సభలో మహిళా భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. వాకథాన్‌లో చురుగ్గా పాల్గొన్న 10 మంది మహిళలను ఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు.
NLG: నల్గొండ పట్టణానికి చెందిన గూడూరు జానకీరాంరెడ్డి కుమార్తె వివాహ వేడుకకు ఆదివారం ఎమ్మెల్యే వేముల హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కట్టంగూర్ మండలం ఇస్మాయిల్‌పల్లిలో రామోజు, సందీప్ కుమారుల పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిన్నారులను దీవించారు. అలాగే నకిరేకల్ మండలం మండలపురంలో సుఖేందర్ రెడ్డి కుమార్తె డోలహోరణలో పాల్గొని ఆశీర్వదించారు.
కొన్ని చిట్కాలతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. విటమిన్లు (A, C, E), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. స్క్రీన్ చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఎండలో వెళ్లేటప్పుడు UV ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్ ధరించాలి. కళ్లకు విశ్రాంతి కోసం రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి.
CTR: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం కారు బోల్తా కొట్టింది. పలమనేరు మండలం గాంధీనగర్ సమీపంలో కారు అదుపు తప్పిన కారు 30 అడుగులు ఎగిరి పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అదృష్టవశాత్తూ గాయాలు లేకుండా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం అయినప్పటికీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖపట్నం శివాజీ పాలెంలోని శివాజీ పార్క్‌లో ఆదివారం నిర్వహించిన ఆనంద ఆదివారం కార్యక్రమంలో GVMC అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొన్నారు. ప్రతి పార్క్‌లో, ప్రతి ఇంటి వద్ద పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. గ్రీన్ క్లైమేట్ టీం NGO ఆధ్వర్యంలో పిచ్చుకల కోసం చెట్లకు ధాన్యపు కంకులు కట్టి వేలాడదీయాలని కోరారు.
NZB: ఎడపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మచ్చుకూర్ గంగాధర్ ఆదివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని, గ్రామంలోని పలు సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, మస్తాన్, నవీన్ పాల్గొన్నారు.
MLG: బంజారాహిల్స్‌లోని కొమురం భీం ఆదివాసి భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు.
KMR: బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ కాసుల విజయ, ఆసుపత్రి సమన్వయకర్త డా. విజయభాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంగలల వరకు 14 ఏళ్లు బాలికలకు HPV వ్యాక్సినేషన్ అందించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
SRPT: సూర్యాపేట పట్టణంలోని ప్రముఖ వివాహ షాపింగ్ మాల్‌లో ఆదివారం సినీ తార నిధి అగర్వాల్ సందడి చేశారు. ఆమె మాల్‌ను సందర్శించడంతో అభిమానులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో చేరి ఆమెను చూడడానికి ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా మాల్ నిర్వాహకులు నిధి అగర్వాల్‌కు స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతూ ఆమె కొంత సమయం గడిపారు.
NZB: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్.పి.వి వ్యాక్సిన్‌ను 14-15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలు అందరికీ తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్.పి.వి వ్యాక్సిన్ ప్రారంభించారు.
SRPT: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా అందించే HPV టీకాలను చేసుకోవాలని సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అన్నారు. ఆదివారం తుంగతుర్తిలోని ఏరియా హాస్పిటల్‌లో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలకు విధిగా ఈ టీకాలను వేయించాలన్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన వెంపడపు గణేష్, బొబ్బిలి(మం) పారాది గ్రామానికి చెందిన అల్లాడ వెంకట రమణ వారి కుటుంబలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ జిల్లా కార్యాలయంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టలో చేరామని తెలిపారు.