• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళ విద్యతోనే సమాజానికి వెలుగు.!

ASR: అరకులోయలో వెలుగు వ్యవస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సృష్టికర్తలు మహిళలను ఆర్టీసీ ప్రాంతీయ జోన్ ఛైర్మన్ దొన్నుదొర దేవతలతో పోల్చి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా విద్యతో ఇంటితో పాటు సమాజానికి మహిళలు వెలుగు ఇస్తారని వేడుకలో పాల్గొన్న మహిళా డాక్టర్, సామాజికవేత్తలు, అధికారులు, నాయకులు పేర్కొన్నారు.

March 8, 2026 / 01:59 PM IST

మదనపల్లెలో సందడి చేసిన సినీనటి

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్ఆర్ షాపింగ్ మాల్‌ను సినీనటి మీనాక్షి చౌదరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మాల్ పట్టణ ప్రజలకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

March 8, 2026 / 01:57 PM IST

మహిళల అభ్యున్నతికి NTR ఎంతో చేశారు: సీఎం

AP: రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే మూడు పార్టీలు కలిశాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన నాయకుడు NTR అని తెలిపారు. ‘మహిళా యూనివర్సిటీ తెచ్చిన ఘనత NTRదే. మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక యూనివర్సిటీ తెచ్చారు. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

March 8, 2026 / 01:55 PM IST

మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు

KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు ఇవాళ అందజేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ASP హుస్సేన్ పీరా పాల్గొని మహిళా పోలీసులను అభినందించారు. మహిళా పోలీసులు సమాజ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

March 8, 2026 / 01:51 PM IST

‘స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి’

MHBD: పెద్దవంగర మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

March 8, 2026 / 01:50 PM IST

మాజీ MLA కూతురిని ఆశీర్వదించిన MLA

HNK: జిల్లా కేంద్రంలోని SVS గార్డెన్స్‌లో ఆదివారం వర్ధన్నపేట మాజీ MLA కొండేటి శ్రీధర్ కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

March 8, 2026 / 01:50 PM IST

బాడీ లోషన్ రాస్తున్నారా..?

చర్మతత్వానికి నప్పే లోషన్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖానికి క్రీమ్‌లు రాసే ముందు చర్మాన్ని శుభ్రం చేయాలి. చర్మం కాస్త తడిగా, వెచ్చగా ఉన్నప్పుడు వీటిని రాస్తే రంధ్రాల్లోకి సులభంగా ఇంకి, తేమను కాపాడతాయి. అందుకే స్నానం చేసిన వెంటనే లోషన్ రాయడం మంచిది. చర్మం చల్లగా ఉంటే గోరువెచ్చని టవల్‌తో తుడుచుకున్నాక అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

March 8, 2026 / 01:50 PM IST

మహిళలకు చంద్రబాబు అండగా నిలిచారు: కందుల

AP: మహిళలకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2024-25లో లక్ష మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసినట్లు చెప్పారు. ఈ సంఖ్యను 2028-29 నాటికి 5 లక్షల మందికి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.

March 8, 2026 / 01:49 PM IST

ఏలూరులో మోటార్ సైకిల్ ర్యాలీ

ELR: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మహిళా సిబ్బంది, జిల్లాలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘అభయ–శక్తి టీం’లు జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.

March 8, 2026 / 01:49 PM IST

‘సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’

PPM: సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి, డిగ్రీ పూర్తి చేసి, సొంతంగా సంపాదించే వరకు వివాహం వద్దు అని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్‌సీఎం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకు కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

March 8, 2026 / 01:48 PM IST

బైరెడ్డిని కలిసిన పాముల పాడు మండల రైతులు

NDL: చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని పాముల పాడు మండల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిసి ఎత్తిపోతల ద్వారా కేసీకి నీరు ఇప్పించాలని కోరారు. స్పందించిన బైరెడ్డి ఫోన్ ద్వారా EE ప్రతాప్‌తో మాట్లాడి, విడుదల చేయించారు. దీంతో రైతులు సంతోష వ్యక్తం చేశారు.

March 8, 2026 / 01:45 PM IST

‘గుదిబండగా వంట గ్యాస్ ధరలు’

NLG: పేద కుటుంబాలు ఇప్పటికే ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతుండగా పెంచిన వంట గ్యాస్ ధరలు వారికి గుదిబండగా మారాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల కూడలిలో ఆదివారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై మహిళలు వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

March 8, 2026 / 01:45 PM IST

మహిళలకు ఉపాధి కల్పిస్తున్న బాలమణి

MBNR: జడ్చర్లకు చెందిన ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి మహిళల స్వయం ఉపాధికి కృషి చేస్తున్నారు. 2021లో సంస్థను స్థాపించి సుమారు 1000 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. కరోనా సమయంలో మాస్కులు తయారు చేసి పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ బట్ట సంచులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

March 8, 2026 / 01:45 PM IST

రిమ్స్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ కిట్ల పంపిణీ

ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్ కలిసి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కిట్లను ఆవిష్కరించి వైద్య సిబ్బందికి అందజేశారు. IOCL, సన్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, మహిళా వైద్యులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు.

March 8, 2026 / 01:45 PM IST

రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

VKB: శ్రీ పాంబండ శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. కుల్కచర్లలోని బండవెల్కిచర్లలో ఏకశిలా పర్వతంపై వెలసిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నేటి నుంచి ఉగాది పర్వదినం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని దేవాలయం ఈవో బాల నరసయ్య, ఛైర్మన్ మహిపాల్ రెడ్డి తెలిపారు. దైవదర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

March 8, 2026 / 01:41 PM IST