HNK: జిల్లా కేంద్రంలోని SVS గార్డెన్స్‌లో ఆదివారం వర్ధన్నపేట మాజీ MLA కొండేటి శ్రీధర్ కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.