SKLM: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబ వ్యవస్థ నుంచి దేశఅభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలసేవలు అమూల్యమని ఆయన పేర్కొన్నారు.
GDWL: అయిజ మండలం పులికల్ శివారులో తుంగభద్ర నది పరివాహక ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్ఐ శ్రీనివాసరావు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా ఉంచి వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
కర్నూలు: జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ. 257, స్కిన్ లెస్ చికెన్ రూ. 292, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.
CTR: చిత్తూరు బజారు వీధిలోని శ్రీ శివ షణ్ముఖ వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన 9వ మహా కుంభాభిషేక వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, అర్చకులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామానికి చెందిన మునేశ్వర్ బండు రాష్ట్ర స్థాయి సీఎం కప్ వీల్ చైర్ పోటీల్లో సత్త చాటాడు. మూడు వెండి పథకాలను పొందిన ఈయన సౌత్ జోన్, జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయి వీల్ చైర్ జట్టులో ఉన్న బండు జాతీయ స్థాయికి చేరడంతో పలువురు ఆయన్ను అభినందించారు.
NLG: జిల్లాలో మహిళల రాజకీయ ప్రస్థానం.. 866 జీపీలకు జరిగిన ఎన్నికల్లో 432 చోట్ల మహిళలు సర్పంచులుగా విజయం సాధించి పాలన పగ్గాలు చేపట్టారు. అలాగే, జిల్లాలోని ఏడు పురపాలికల్లో ఐదింటికి మహిళలే ఛైర్‌పర్సన్‌లుగా ఉన్నారు. 69 మంది మహిళా కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధికి కృషి చేస్తుండగా, నల్గొండ తొలి మహిళా మేయర్‌గా బుర్రి చైతన్య పాలన సాగిస్తున్నారు.
రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ క్రేజీ కాంబోలో వస్తున్న మూవీ ‘ధురంధర్ 2’. 2026, మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రారంభమైన ప్రీమియర్ షో బుకింగ్స్‌లో కేవలం కొద్దిసేపట్లోనే 86,680 టికెట్లు అమ్ముడవడం విశేషం. మొదటి భాగం విజయం అందించిన జోష్‌తో, రెండో భాగం భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
VZM: చీపురుపల్లి మేజర్ పంచాయతీ JA పర్యవేక్షణలో ఇవాళ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు జి.అగ్రహారం, రామాంజనేయ కాలనీ, కొత్త గవిడి వీధి, హట్కో కాలనీ, లావేరు రోడ్డు, హైస్కూల్ రోడ్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టి చెత్త కుప్పలు తొలగించి పంచాయతీ వాహనాలు ద్వారా డంపింగ్ యార్డ్ తరలించారు. ఈ సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా ఉండలని JA సూచించారు
KMR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జుక్కల్ MLA తోట లక్ష్మి కాంతారావు మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
KDP: జమ్మలమడుగులోని లక్ష్మీ నగర్ కాలనీలో ఓ రేకులు షేడ్‌లో దాచిన 53 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్ సీఐ శివన్న ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో విజిలెన్స్ అధికారుల వరుస దాడులతో అక్రమ రేషన్ బియ్యం రవాణాదారులలో వణుకు మొదలైంది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గొడౌన్‌కు తరలించారు.
SKLM: స్నేహితుడి వివాహానికి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి, బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని బడ్డీ బాలకృష్ణ (25) అనే ఆర్మీ జవాను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడు ఆర్.దిలీప్ అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రున్ని చికిత్స కోసం 108లో ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై ఆర్.జనార్దన్ రావు కేసు నమోదు చేశారు.
JGL: ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా రామకృష్ణ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న గణేశ్ ప్రభుత్వం నిర్వహించనున్న 45 రోజుల శిక్షణకు హైదరాబాద్ వెళ్లడంతో కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. రామకృష్ణను కార్యాలయ సిబ్బంది సన్మానించి, స్వాగతం పలికారు.
GDWL: తెలంగాణలో బలమైన మహిళా నేత్రిగా పేరుపొందిన DK అరుణ ఆరు పదుల వయస్సులో కూడా జోష్‌తో సాగుతున్నారు. ఆమె 1960 మే 4న నారాయణపేట్‌లో జన్మించారు. 18 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చారు. గద్వాల నుంచి 2004-2018 వరకు MLA, వైఎస్, రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా 2019లో BJPలో చేరి జాతీయ ఉపాధ్యక్షురాలు, MPగా కొనసాగుతూ.. మహిళల సాధికారతకు విశేష సేవలు అందిస్తున్నారు.
W.G: ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్’, అజీవికా మిషన్ పథకాలపై జిల్లా వ్యాప్తంగా ఆరు వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లాలో బలమైన మహిళా నేత్రిగా పేరుపొందిన DK అరుణ..1960 మే 4న నారాయణపేటలో జన్మించింది. 18 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గద్వాల నుంచి 2004-2018 వరకు MLA, వైఎస్, రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019లో BJPలో చేరి జాతీయ ఉపాధ్యక్షురాలు, MPగా కోనసాగుతూ.. మహిళల సాధికారతకు విశేష సేవలు అందిస్తున్నారు.