• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..!

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి, కుమ్మరిగూడెం గ్రామాలకు చెందిన పలువురు BRS కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అనంతరం MLA కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు. తదితరులు పాల్గొన్నారు.

March 9, 2026 / 10:28 PM IST

‘మన ఇసుక వాహనం’ యాప్ ఉన్నా ఆగని అక్రమ రవాణా..

NZB: జిల్లాలో ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం’ యాప్‌తో కూడా పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదన్న విషయం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇసుక రవాణా తతంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘మన ఇసుక వాహనం’ ప్రయత్నాలకు అధికారులే గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.

March 9, 2026 / 10:05 PM IST

ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్‌

SRPT: దేశంలో సెక్యులరిజానికి కాంగ్రెస్‌ పార్టీయే కేరాఫ్ అడ్రస్‌ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలిచేది తమ పార్టీయేననీ ఆయన అన్నారు.

March 9, 2026 / 10:01 PM IST

రేపు విడవలూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: విడవలూరు మండలంలోని ముదివర్తి, అన్నారెడ్డిపాలెం, అలగానిపాడు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ విజయ కుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముదివర్తి సబ్ స్టేషన్ వద్ద 11/33 KV విద్యుత్ లైన్ల RDSS స్కీమ్ పనుల కారణంగా.. ఆక్వా, వ్యవసాయం, త్రాగునీటి కరెంట్ సరఫరా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామన్నారు.

March 9, 2026 / 10:00 PM IST

ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

ATP: ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల కోసం పని చేసేవారే నిజమైన నాయకులని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జిలతో ఆయన సమావేశమయ్యారు. సచివాలయాల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చొరవ చూపాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

March 9, 2026 / 10:00 PM IST

‘జగన్ మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదం’

AP: మాజీ సీఎం జగన్ మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి సవిత విమర్శించారు. ‘మహిళా సాధికారత కోసం చంద్రబాబు పనిచేస్తున్నారు. వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాయలసీమ సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు.. వైసీపీ నేతలకు లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 9, 2026 / 09:55 PM IST

‘రాకాస’ మూవీకి భారీ ‘ఓటీటీ’ డీల్

యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘రాకాస’. అయితే ఈ సినిమా టీజర్ రాకముందే ఈ సినిమా తాలూకా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం ఓటీటీ హక్కులు గానే ఈ సినిమాకి 10 నుంచి 11 కోట్ల మధ్య డీల్ లాక్ అయ్యిందట. ఇక మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదల […]

March 9, 2026 / 09:51 PM IST

ఆయన సలహాలతో నా కల నిజమైంది: సంజూ

టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ తన ఫామ్ వెనుకు ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. ‘క్రికెట్ దిగ్గజమైన సచిన్ నుంచి సలహాలు తీసుకున్నాను. స్పష్టతతో ఉండడం, మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడం.. పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం వంటివి ఎంతో ఉపయోగపడ్డాయి. వరల్డ్‌కప్‌లో నేను గొప్పగా రాణించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.

March 9, 2026 / 09:50 PM IST

నార్త్ అల్వాల్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మహిళా దినోత్సవం’

MDCL: అల్వాల్ పట్టణంలో పంచశీల కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నార్త్ అల్వాల్ సొసైటీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది కాలనీల మహిళలు కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెవిక్రిల్ లిప్పన్ ఆర్ట్ వర్క్‌షాప్, ర్యాంప్ వాక్, మురల్ పెయింటింగ్‌తో పాటు తంబోలా, డంబ్ చరాడ్స్, అంతాక్షరి వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

March 9, 2026 / 09:44 PM IST

ఓపెన్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు

HYD: మార్చి 25, 26 తేదీల్లో HYDలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు హాజరుకానున్నారు. దూరవిద్య ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాల విస్తరణపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. విద్యా రంగంలో మారుతున్న పరిస్థితులు, నూతన సాంకేతికతలపై ప్రసంగాలు ఉండనున్నాయి.

March 9, 2026 / 09:43 PM IST

విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన

BDK: కొత్తగూడెం స్థానిక వివేకవర్ధని డిగ్రీ & పీజీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ అశోక్ కుమార్, ఎస్సై జితేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా స్కామ్స్ గురించి విద్యార్థులకు వివరించారు.

March 9, 2026 / 09:42 PM IST

జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

March 9, 2026 / 09:42 PM IST

11 రోజుల్లో 13వేల కిలోమీటర్ల జర్నీ!

B6 అనే 4 నెలల పక్షి కేవలం 11 రోజుల్లో 13,560 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాస్కా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించింది. ప్రయాణంలో శక్తి కోసం తన అవయవాలను తగ్గించుకుంటూ, మెదడులో సగభాగాన్ని నిద్రపుచ్చి మిగిలిన సగంతో లక్ష్యాన్ని చేరుకుంది. ప్రకృతిలోని ఈ వింత శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

March 9, 2026 / 09:42 PM IST

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌గా సుస్మిత

TPT: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌గా ఎస్ఆర్ సుస్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ నియామకాలలో ఎంపికైన ఆమెకు ఇదే తొలి పోస్టింగ్ కావడం విశేషం. కార్యాలయంలో సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తానని సుస్మిత తెలిపారు.

March 9, 2026 / 09:37 PM IST

మండనున్న ఏసీల ధరలు

వేసవిలో ఎండలతో పాటు ఏసీల ధరలు కూడా మండనున్నాయి. ఏసీ తయారీలో రాగి వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి తగ్గే కొద్దీ కంపెనీలకు భారం పెరుగుతోంది. దీంతో ఏసీల ధరలు 5-15% పెరిగే అవకాశం ఉంది. వోల్టాస్, బ్లూస్టార్, LG, హయర్, దైకిన్ వంటి కంపెనీలు తమ అన్ని మోడళ్ల ఏసీల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

March 9, 2026 / 09:35 PM IST