NRPT: నారాయణపేట పట్టణ శివారు యాదగిరి రోడ్డులో సోమవారం సాయంత్రం ఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఉండేందుకు వాహనాలు తనిఖీలు చేపట్టినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి, కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి రాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా, సేవిస్తున్నా సమాచారం ఇవ్వాలన్నారు.
CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్యమృగాల సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కల్లూరు, కుప్పం, యర్రావారిపాలెం ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కొనసాగుతుండగా, బైరెడ్డిపల్లె మండలంలో తాజాగా చిరుత ఒక ఆవును చంపినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారు.
ELR: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఉదయం 9 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం పోలవరం నుంచి రాజమండ్రి బయలుదేరి వెళతారన్నారు.
AP: రాష్ట్రంలో మరో రెండు ఎకనామిక్ రీజియన్లు (అమరావతి, తిరుపతి) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ సీఈవోగా ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్.. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈవోగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను నియమించింది.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 72,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.41 కోట్లు నమోదైంది. ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి సుమారు 12-15 గంటల సమయం పడుతోంది.
AP: పోలవరంలో ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం పనులపై పలు సూచనలు చేసి.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించనున్నారు.
BPT: అద్దంకి ఏకలవ్య నగర్‌కు చెందిన ST మహిళలు తాకట్టు పెట్టిన బంగారం విషయంలో మోసం జరిగిందని ఆరోపించారు. స్థానిక వ్యాపారి రామాంజనేయులు బంగారం తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని KVPS జిల్లా కార్యదర్శి రఘురామ్ డిమాండ్ చేశారు.
KMM: ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ సహా మొత్తం 43 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు మద్దతుగా సోమవారం అనుమతి లేకుండా ధర్నా చేపట్టి, వారిని రెచ్చగొట్టారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
BPT: అద్దంకి ఏకలవ్య నగర్‌కు చెందిన ST మహిళలు తాకట్టు పెట్టిన బంగారం విషయంలో మోసం జరిగిందని ఆరోపించారు. స్థానిక వ్యాపారి రామాంజనేయులు బంగారం తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని KVPS జిల్లా కార్యదర్శి రఘురామ్ డిమాండ్ చేశారు.
WGL: పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం MSP జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగపై MLA కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పదవుల కోసం పార్టీలు మారే కడియంకు ఉద్యమ నేతలను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ADB: ఆదిలాబాద్ పట్టణానికి నీటిని అందించే లాండసాంగి పంప్ హౌస్ వద్ద 500KV ట్రాన్స్ ఫార్మర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. మరమ్మతుల నిమిత్తం దానిని పంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో పట్టణంలో మంచినీటి సరఫరా ఉండదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కమిషనర్ కోరారు.
వనపర్తి జిల్లాలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మదనపూర్‌లో 37.9 డిగ్రీలు, కానాయిపల్లి- 37.6, ఆత్మకూరు- 37.5, దగడ-37.3, విలియంకొండ-36.8, వీపనగండ్ల, వనపర్తి- 36.3, పెద్దమందడి- 36.2, జానంపేట, వెలుగొండ- 36.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
TG: హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో నేడు బీఆర్ఎస్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. పార్టీ ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. సభలో ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరించాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా లేవనెత్తాలి అనే అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ ట్రై సిటీస్‌లో స్విగ్గీ, జొమాటో అనుమతి లేకుండా ఆఫర్లు ప్రకటించడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా కమీషన్లు కట్ చేయడం వల్ల హోటళ్లకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోందని హోటల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ విషయంపై పూర్తి లెక్కలు సేకరిస్తున్నామని, త్వరలోనే ఆ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సభ్యులు హెచ్చరించారు.
NDL: ఆత్మకూరు మున్సిపాలిటీ కొత్తపేట కాలనీకి చెందిన షేక్ జాబివుల్లా కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి అండగా నిలిచారు. ఆపరేషన్ కోసం ప్రభుత్వం నుంచి రూ.1,88,483 మంజూరు చేయించారు. సోమవారం TDP నాయకుడు యుగంధర్ రెడ్డి బాధితుడికి LOC లేఖను నిన్న అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న MLAకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.