• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళలు, చిన్నారుల రక్షణకు చట్టాలు

KDP: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు కాలనీలు, గ్రామాలు, పాఠశాలల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాలు హెల్ప్‌లైన్ నంబర్లపై మహిళలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

March 7, 2026 / 08:20 PM IST

కేజీవీబీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఇల్లందలో ఉన్న KGBV బాలికల పాఠశాలను శనివారం MLA కె.ఆర్. నాగరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చదువులో రాణించాలని పేర్కొన్నారు.

March 7, 2026 / 08:19 PM IST

ప్రజా వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పూసపాటిరేగ మండలం కందివలస గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

March 7, 2026 / 08:19 PM IST

కొత్త వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని వినతి

RR: చేవెళ్ల పరిధి అంతారం గ్రామ సర్పంచ్ రామస్వామి మిషన్ భగీరథ డీఈ హారికను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతారం గ్రామంలో పాత వాటర్ ట్యాంక్ వినియోగానికి అనుకూలంగా లేకపోవడంతో దాని స్థానంలో కొత్త ట్యాంక్ నిర్మించాలని డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యుడు ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.

March 7, 2026 / 08:19 PM IST

ఆర్థిక బలోపేతంపై మంత్రి కీలక ప్రకటన

AP: వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై విజయవాడలో EWS సామాజిక వర్గీయులకు నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత గురించి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. సహజ వనరుల వినియోగంతో నేల సారం పెరుగుతుందని అన్నారు.

March 7, 2026 / 08:18 PM IST

ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై సమీక్షించిన ఆర్డీవో

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు ఇంఛార్జ్ ఆర్డీవో దేవకిదేవి అన్నారు. శనివారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి సంబంధించి ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వెనకబడి ఉన్న గ్రామాలలో ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

March 7, 2026 / 08:18 PM IST

‘మన పల్లె–మన నీరు’ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన ‘మన పల్లె – మన నీరు’ కార్యక్రమం అమలుపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువుల సామర్థ్యాన్ని పెంచి నీటి నిల్వలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనుల అమలులో అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.

March 7, 2026 / 08:17 PM IST

ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు

GDWL: నదీ తీర ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుంది అని అయిజ ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించారు. శనివారం పులికల్ శివారులోని తుంగభద్ర నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి, ఇసుకతో సహా వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 7, 2026 / 08:17 PM IST

కామినేని ఆసుపత్రి నుంచి రోగి అదృశ్యం

NLG: నల్లగొండ సుందరయ్య కాలనీకి చెందిన టంగుటూరి ఎల్లయ్య(60), మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి రాగా, అక్కడ కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుమార్తె ఆదిమూలం మహాలక్ష్మి ఫిర్యాదు చేయగా, నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్లయ్య కూలి పని చేసేవాడు.

March 7, 2026 / 08:17 PM IST

‘ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం’

PDPL: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను సన్మానించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ. 40 లక్షలతో 26 మంది వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేశారు.

March 7, 2026 / 08:15 PM IST

విద్యాశాఖ పనితీరులో జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్

KMM: విద్యాశాఖ పనితీరులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచిస్తూ, మార్చి 6 నుంచి 15 వరకు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. పాత సామాగ్రిని తొలగించి, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేయాలని స్పష్టం చేశారు.

March 7, 2026 / 08:15 PM IST

‘ఇళ్ల స్థలాలు కేటాయించాలి’

ASR: చింతపల్లి పంచాయతీలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీడీపీ మండల నేతలు ఆనందరావు, నాగభూషణం, గాంధీ, చినబాబు కోరారు. ఈమేరకు శనివారం మండల తహసీల్దార్ కే.శంకరరావు, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు. ఇళ్లు మంజూరైన 42 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు లేవన్నారు.

March 7, 2026 / 08:15 PM IST

పొలాలకు గుడి చెరువు నీటి విడుదల

SRCL: వేములవాడ పట్టణంలోని గుడి చెరువు తూము నుంచి వేములవాడలో గల పంట పొలాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మిడ్ మానేరు నుంచి చెరువులోకి నీటిని పంపింగ్ చేయాలని, అలాగే గుడి చెరువు నుంచి లక్ష్మీపూర్ పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని అధికారులకు ప్రభుత్వ విప్ ఆదేశాలు జారీ చేశారు.

March 7, 2026 / 08:14 PM IST

ప్రభను సందర్శించిన కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్

ఎన్టీఆర్: అనిగండ్లపాడు నుంచి పెనుగంచిప్రోలు మండలంలో దేవస్థానానికి కొల్లా వారి ఇంటి నుంచి బయలుదేరిన పసుపు-కుంకుమ బండ్లకు కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ శనివారం రాత్రి కొబ్బరికాయ కొట్టు ప్రారంభించారు. అనంతరం తెలుగు యువత ఏర్పాటు చేసిన ప్రభను సందర్శించి యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.

March 7, 2026 / 08:14 PM IST

ఇటిక్యాల PHCలో ఆకస్మిక తనిఖీ

GDWL: ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా ఎంసీహెచ్ అధికారిని డాక్టర్ ప్రసూన రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదికలను తక్షణమే ఆన్లైన్ ద్వారా జిల్లాకు పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 7, 2026 / 08:14 PM IST