• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అరుదైన పక్షి..క్యూ కడుతున్న జనం

CTR: చిత్తూరులో రిటైర్డ్ పోలీసు అధికారికి శనివారం ఓ అరుదైన పక్షి చిక్కింది. మురుకంబట్టు సర్కిల్ పరిధిలోని శ్రీ కొలాత్త అమ్మన్ ఆలయం వద్ద రిటైర్డ్ ASI రాజేంద్రకు ముక్కు లేని విధంగా కనిపిస్తున్న ఓ వింత పక్షి కనిపించింది. చూడటానికి భిన్నంగా ఉండటంతో ఆలయానికి వచ్చిన భక్తులు దాన్ని చూసేందుకు క్యూ కట్టారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

March 7, 2026 / 03:24 PM IST

జిల్లా యువగేయ రచయితకు గద్దర్ అవార్డు

BHPL: గణపురం మండలానికి చెందిన నందకిశోర్ తెలంగాణ గద్దర్ అవార్డ్స్-2025లో ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు. ప్రముఖ హీరోలు ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమాలోని ‘నా కొడుకా’ పాటకు గాను ఆయనకు ఈ గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డుతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 7, 2026 / 03:20 PM IST

ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న కలెక్టర్

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

March 7, 2026 / 03:20 PM IST

కేంద్రంతో కలిసి ముందుకెళ్తున్నాం: చంద్రబాబు

AP: దేశాభివృద్ధిలో సంస్కరణలే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘రైసిన్ డైలాగ్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.

March 7, 2026 / 03:20 PM IST

‘సీతారాంపురం కాలనీలో సమస్యలు పరిష్కరించండి’

సత్యసాయి: పరిగిలోని సీతారాంపురం కాలనీలో డ్రైనేజీ సమస్యలు, పాముల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పంచాయతీ సెక్రటరీ అరుణకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె శనివారం స్థానిక నాయకులతో కలసి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యను త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

March 7, 2026 / 03:20 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన మండల అధికారి

JN: కొడకండ్ల మండలం నరసింగాపురం గ్రామంలోని దుర్గమ్మ గుడి నుంచి రిజర్వాయర్ గేట్ వరకు కాలువ పక్క కందకం పూడికతీత పనులను శనివారం ఉపాధి హామీ మండల అధికారి కుమారస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు పని విధానం, నాణ్యతపై పాటించాల్సిన విషయాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మయ్య, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 03:20 PM IST

రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి

ATP: డి.హీరేమల్ మండలంలో రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి. హోసగుడ్డ గ్రామ సమీపంలో మేత కోసం వెళ్లిన గొర్రెలు.. పట్టాలు దాటుతుండగా గుంతకల్ నుంచి చిక్కజజూర్ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. రూ. 3 లక్షల నష్టం వాటిల్లినట్లు కాపరి ముక్కన్న వాపోయారు.

March 7, 2026 / 03:20 PM IST

‘భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయండి’

NGKL: ఆమనగల్లు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఛైర్మన్ పత్య నాయక్, కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

March 7, 2026 / 03:20 PM IST

ఐకాన్ స్టార్, రౌడీ బాయ్ మల్టీస్టారర్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ‘AA23’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో విజయ్ భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 03:20 PM IST

అసెంబ్లీలో సీఎంను నిలదీస్తాం: పాయల్ శంకర్

TG: రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పొలంబాటకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తామన్నారని.. ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై గ్రామాల్లో పోరాటాలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో సీఎంను నిలదీస్తామన్నారు.

March 7, 2026 / 03:19 PM IST

‘ఆదర్శంగా నిలిచిన దివ్యాంగుడు’

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర రమేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. అతనికి ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. ఆ సోదరీమణుల వివాహం తర్వాత తన తండ్రి మరణించారు. దీంతో రమేష్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ.. తనకు వచ్చే సంపాదనతో కన్నతల్లిని చూసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

March 7, 2026 / 03:18 PM IST

చికిత్స పొందుతూ.. యువకుడు మృతి

MBNR: రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైలం (16) అనే యువకుడు మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న శ్రీశైలంను మరికల్‌కు చెందిన బొలెరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మరణించాడు.

March 7, 2026 / 03:15 PM IST

‘మూడు రోజులు బయటికి రావొద్దు’

BDK: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని సూచించారు.

March 7, 2026 / 03:15 PM IST

గ్రావెల్ క్వారీలపై ఆందోళన

TPT: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురువం బాబు సత్యవేడు నియోజకవర్గంలో గ్రావెల్ క్వారీల నుంచి భారీగా టిప్పర్ల ద్వారా తరలింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో రోడ్లు ధ్వంసమై దుమ్ము, శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్వారీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

March 7, 2026 / 03:14 PM IST

అంగన్వాడీ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ

NRML: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టిక ఆహారం అదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

March 7, 2026 / 03:14 PM IST