• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు వదలకూడదు?

హిందూ ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఒంటరిగా వదలకూడదు. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉందని గరుడ పురాణం చెబుతోంది. మృతదేహం నుంచి వచ్చే ఒక రకమైన వాసనకు చీమలు, కీటకాలు లేదా ఎలుకలు వంటివి త్వరగా ఆకర్షితమవుతాయి. అలాగే ఆత్మ తన శరీరాన్ని చూస్తూ అక్కడే తిరుగుతుందని, అందరూ తన పక్కన ఉండటం వల్ల ఆ ఆత్మకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.

March 7, 2026 / 12:33 PM IST

మావుళ్ళమ్మ అమ్మవారి జాతర.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

E.G: సీతానగరం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర మహోత్సవంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు.

March 7, 2026 / 12:32 PM IST

ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్న సిబ్బంది

RR: తొమ్మిదిరేకుల పెట్రోల్ బంక్‌లో కరెంట్ లేదని చెప్పి సేవలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశ్నించిన వినియోగదారులతో సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను గౌరవించని నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

March 7, 2026 / 12:31 PM IST

నూజివీడులో కార్డెన్ సెర్చ్ చేసిన పోలీసులు

ELR: నూజివీడులోని డాక్టర్ ఎంఆర్ అప్పారావు కాలనీలో శనివారం నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో 31 వాహనాలను సీజ్ చేసినట్లు DSP ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో గంజాయి మొక్క పెంచుతున్న ఓ మహిళపై, ఎక్సైజ్ చట్టం కింద మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఈ సోదాలు చేపట్టినట్లు వివరించారు.

March 7, 2026 / 12:30 PM IST

మద్దూరు ఆసుపత్రిలో చలివేంద్రం ప్రారంభం

NRPT: మద్దూరు మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల కోసం శనివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కల్లపు రాకేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి జనార్ధన్ ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఆసుపత్రికి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

March 7, 2026 / 12:30 PM IST

జనసేన పార్టీ లో చేరిన మాజీ MLA

PPM: నాగూరు మాజీఎమ్మెల్యే నిమ్మక జయరాజు జనసేన పార్టీలో చేరారు. వనజ గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జన సేన మండలాధ్యక్షుడు వి.శివకుమార్ చేతులమీదుగా సభ్యత్వం తీసుకున్నారు. APDCM , అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

March 7, 2026 / 12:29 PM IST

‘వైద్యం నిపుణుల సేవలు వినియోగించుకోవాలి’

SRCL: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని DMHO ఎస్.రజిత కోరారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్ష చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నిర్దేశిత రోజుల్లో నాలుగు దశల్లో నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు చేస్తారని తెలిపారు.

March 7, 2026 / 12:29 PM IST

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల మధ్య విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను NCB అధికారులు ఛేదించారు. తమిళనాడు తూత్తుకుడిలో 78 కిలోల హ్యాష్ ఆయిల్, తెలంగాణ రాయికల్ వద్ద 2 కిలోల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో శ్రీలంక జాతీయుడితో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

March 7, 2026 / 12:27 PM IST

పెద్దాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్

KKD: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అపరిచితులు అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పెద్దాపురం ఇంఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. పెద్దాపురం శివారు సురంపాలెం రోడ్డు గల జగనన్న కాలనీలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేశారు.

March 7, 2026 / 12:26 PM IST

నీలమణి దుర్గ ఆలయంలో మహా చండీ శుభాభిషేకం

SKLM: హిరమండలం పెద్ద కోరడలోని నీలమణి దుర్గ ఆలయంలో మహా చండీ శుభాభిషేకం మహోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు భాస్కరభట్ల, వరప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.

March 7, 2026 / 12:24 PM IST

‘EPIC’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘బేబీ’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘EPIC- First Semester’. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ ప్రోమో విడుదల కాగా..  ఫుల్ పాట మార్చి 9న విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్.

March 7, 2026 / 12:22 PM IST

సైబర్ క్రైమ్ బాధితులకు RBI పరిహారం!

సైబర్ మోసాలకు గురైనవారికి RBI ఊరటనిచ్చే కబురు చెప్పింది. రూ.50,000లోపు మోసాలకు బాధితులకు గరిష్ఠంగా రూ.25,000 పరిహారం అందించాలని నిర్ణయించింది. ఇందులో RBI 65%, కస్టమర్-బెనిఫిషియరీ బ్యాంకులు చెరో 10% భరిస్తాయి. మోసపోయినవారు 5 రోజుల్లోపు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలి. దీంతో కొంతైనా పరిహారం లభిస్తుంది. కాగా రూ.50 వేల కంటే ఎక్కువ కోల్పోయినవారికి ఇది వర్తించదు.

March 7, 2026 / 12:21 PM IST

‘డిగ్రీ అధ్యాపకురాలిపై చర్యలు తీసుకోవాలి’

ADB: ఉట్నూర్‌లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న అధ్యాపకురాలిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు జాదవ్ సోమేశ్ డిమాండ్ చేశారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులు హాస్టల్లో ఉంటూ చదవుకుంటున్న గిరిజన విద్యార్థినిలను బూతులు తిట్టడం సరికాదన్నారు.

March 7, 2026 / 12:21 PM IST

ఈనెల 11న దివ్యాంగులకు పరికరాల గుర్తింపు శిబిరం

TPT: ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వయో వృద్ధులకు అవసరమైన సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మురళీకృష్ణ తెలిపారు‌. ఈ కార్యక్రమం సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది. దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను అందజేస్తారు. అర్హులైన వారు ధృవపత్రాలతో హాజరు కావలన్నారు.

March 7, 2026 / 12:21 PM IST

కోటకొండలో అరుదైన ఏకశిలా ఆంజనేయ విగ్రహం

ATP: పెద్దవడుగూరు మండలంలోని కోటకొండ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ 40 అడుగుల అరుదైన ఏకశిలా ఆంజనేయ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆంజనేయుడు దక్షిణ ముఖంగా ఉంటాడు, కానీ ఇక్కడ తూర్పు దిశగా ఉండటం విశేషం. శ్రీరాముడు స్వయంగా బాణంతో ఈ రూపాన్ని గీశారని పురాణాలు చెబుతున్నాయి.

March 7, 2026 / 12:20 PM IST