E.G: జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా, కమిషన్ కార్యదర్శి గుడే శ్రీనివాస్ జిల్లాలో పర్యటన సందర్భంగా శనివారం రాజమండ్రిలోని వోఎన్‌జీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ స్వాగతం పలికారు. ఛైర్మన్ వెంట జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ గడ్డం సునీల్ పాల్గొన్నారు.
✦ ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా✦ ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్ట్స్✦ ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం✦ ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు✦ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్✦ ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
ఇంగ్లండ్‌తో T20 WC సెమీస్‌లో చివరి ఓవర్ వేసేది తానే అని తెలిసినప్పడు కొంత భయమేసిందని శివమ్ దూబే పేర్కొన్నాడు. సెమీస్‌లో చివరి ఓవర్ అంటే సవాలేనని, మ్యాచ్ ఫలితాన్ని మార్చగల తొలి 2 బంతులపై చాలా ఫోకస్ చేశానని తెలిపాడు. ఇక 30 పరుగులను డిఫెండ్ చేసే క్రమంలో దూబే వేసిన తొలి బంతికే.. నిలదొక్కుకుని ఆడుతున్న బెథెల్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.
SRPT: నడిగూడెం మండలం నారాయణపురం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నెం నర్సిరెడ్డి ఇవాళ మృతిచెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నారాయణపురం గ్రామాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పలువురు నేతలు కొనియాడారు.
MDCL: బోడుప్పల్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) పరిశోధన కేంద్రాన్ని ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల B.Sc వృక్షశాస్త్ర విద్యార్థులు సందర్శించారు. శాస్త్రవేత్తలు నిమ్మగడ్డి, జేరనీయం, అశ్వగంధ, తులసి వంటి ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు, డిస్టిలేషన్ విధానం వివరించారు. డైరెక్టర్ జి.వి.కిరణ్ బాబు పాల్గొన్నారు.
MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99వ ‘ప్రజా పాలన-ప్రజా ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సందడి నెలకొంది. పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ‘ప్రజల వద్దకే పాలన’ అనే నినాదంతో మున్సిపల్ యంత్రాంగం శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.
NDL: బండి ఆత్మకూరు మండలం సోమయాజులపల్లె గ్రామానికి చెందిన మునిగ సుకన్య అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రభుత్వం తరుపున రూ.8 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేపించారు. గ్రామ టీడీపీ నాయకులు ఎల్‌వోసీ పత్రాన్ని కుటుంబానికి ఇవాళ అందించారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడు – నాగ చైతన్య(తండేల్) ఉత్తమ నటి – రష్మిక మందాన(ది గర్ల్ ఫ్రెండ్), ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాబు, ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో, నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్
TPT: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో మాస్టర్స్ టెన్నిస్, బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి తెలిపారు. ఆసక్తి గలవారు క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలని, వివరాలకు 9948444759, 9177931531 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
TG: హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులకు డ్రైవర్లు కావాలని ఆటోల వెనుక యాడ్స్ చూస్తూనే ఉంటాం. అయితే ఓ వైపు ఆర్టీసీ ఫ్రీ బస్ వల్ల తమ బతుకులు ఆగం అవుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ల కోసం అదే ఆటోల మీద యాడ్స్ వేయడం గమనార్హం.
సత్యసాయి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంలో సీఎస్ సాయిప్రసాద్ కీలక చర్యలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఆయనకు సహకరించిన ఎమ్మార్వోలు యుగేశ్వరీదేవి, నీలకంఠారెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడిన అంశంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవంలో కేశినేని చిన్ని, జానకీ లక్ష్మి దంపతులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు అమ్మవారికి పసుపు కుంకుమ, పండ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
GDWL: అయిజ మండలం బింగి దొడ్డి పెద్ద చెరువు కట్ట కింద ఉన్న తిమ్మప్ప స్వామికి శనివారం విశేష పూజలు జరిగాయి. అర్చకులు కోనేరు జలాలతో స్వయంభూ విగ్రహానికి అభిషేకం చేసి అర్చన, ఆకు పూజ, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి భజన కార్యక్రమం ఉంటుందని సేవకులు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలో చేపట్టిన ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరగడంతో అధికారుల ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పని చేయాలని కూలీలకు సూచించడం జరిగిందన్నారు. అలాగే ఎండదెబ్బ తగలకుండా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు.
JGL: గొల్లపల్లి మండలంలోని రంగదామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ‘ప్రజా పాలన-పల్లె ప్రగతి’ పనులను సర్పంచ్ అఖిల ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు నీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.