• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థినిలకు పారిశుద్ధ్య డ్రైవ్

NLG: వలిగొండ (బీబీనగర్ క్యాంపస్)లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను ప్రిన్సిపల్ ఎస్. రూప ప్రారంభించారు. విద్యార్థినులకు పారిశుద్ధ్య డ్రైవ్‌పై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 7, 2026 / 11:27 AM IST

‘చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’

MNCL: చట్టాలపై వార్డు సభ్యులు అవగాహన కలిగి ఉండాలని లక్షెట్టిపేట జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాలలోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, వార్డు సభ్యుల విధులపై అవగాహన కల్పించారు.

March 7, 2026 / 11:27 AM IST

BREAKING: గద్దర్ అవార్డులు ప్రకటన

TG: తెలంగాణ ప్రభుత్వం 2025- గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం- చిరంజీవి, పైడి జైరాజ్ అవార్డ్- కమల్ హాసన్, సినారె అవార్డు – సుద్దాల అశోక్ తేజ, రఘుపతి వెంకయ్య అవార్డు- రమేష్ ప్రసాద్, అక్కినేని నాగేశ్వర రావు అవార్డు – జయసుధ, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీ దత్‌లను వరించింది.

March 7, 2026 / 11:27 AM IST

‘జడ్చర్లలో పన్నులు సకాలంలో చెల్లించండి’

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో ఇంటి, నీటి పన్నులు, వృత్తి-వ్యాపార లైసెన్స్ ఫీజులను సకాలంలో చెల్లించాలని కమిషనర్ లక్ష్మారెడ్డి కోరారు. శనివారం సిబ్బందితో కలిసి పలు వార్డుల్లో పర్యటించి పన్నులు వసూలు చేశారు. సిబ్బంది కాలనీలకు వస్తున్నందున వారికి సహకరించి బకాయిలు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

March 7, 2026 / 11:25 AM IST

బీ ఫార్మసీ గరిష్ట ఫీజు రూ. 1.21 లక్షలు

TG: రాష్ట్రంలో బీఫార్మసీ ఫీజు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే గరిష్టంగా రూ.1.21లక్షలు, ఫార్మా డీ కోర్సుకు రూ. 1,37,500, బీఆర్క్ కు రూ. 1.32 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో 120 బీఫార్మసీ కళాశాలలుండగా.. కేవలం 6 కళాశాలల్లో మాత్రమే లక్షకుపైగా ఫీజు ఉంది.

March 7, 2026 / 11:25 AM IST

సమైక్యతకు ఇదే నిదర్శనం..!

KDP: కమలాపురంలో మత సామరస్యానికి నిదర్శనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియోపతి డాక్టర్ షాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా 200 పేద ముస్లిం కుటుంబాలు, మహిళలకు రైస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవడం సమైక్యతకు నిదర్శనమని స్థానికులు అభినందించారు.

March 7, 2026 / 11:24 AM IST

హైదరాబాద్‌లో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం జరగుతోంది. మహిళ భద్రత.. పురుషుల బాధ్యత అనే లక్ష్యంతో.. అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ మహిళా భద్రత విభాగం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి నటుడు సాయిధరమ్ తేజ్ హాజరయ్యారు.

March 7, 2026 / 11:23 AM IST

పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలి: కలెక్టర్

JN: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలోని చెరువు వద్ద రోడ్డుకు ఇరువైపులా జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త తొలగింపు పరిక్రియను పక్కాగా చేపట్టాలని సూచించారు.

March 7, 2026 / 11:23 AM IST

రోడ్డు విస్తరణకు మోక్షమెప్పుడో..?

SDPT: చేర్యాల అంగడి బజారు నుండి పెద్దమ్మ గడ్డ వరకు ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారి గుండా దాదాపు 30 నుండి 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు ఇరుగ్గా ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ చేపట్టి  సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. 

March 7, 2026 / 11:23 AM IST

‘మచిలీపట్నం టౌన్ హాలుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’

కృష్ణా: మచిలీపట్నం టౌన్ హాలును ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరిన టౌన్ హాలును శనివారం ఆయన పరిశీలించారు. ఆధునిక ఫంక్షన్ హాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండోమెంట్ అధికారులు తయారు చేసిన డిజైన్లను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు.

March 7, 2026 / 11:22 AM IST

వీధి నాటకంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన

VSP: జాలరిపేట 19వ వార్డులో జీవీఎంసీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’లో భాగంగా ఇవాళ అవగాహన వీధి నాటకం నిర్వహించారు. చెత్త విభజన, ప్లాస్టిక్ నిషేధం, హోమ్ కంపోస్టింగ్ వంటి అంశాలపై కళాకారులు ప్రజలకు చైతన్యం కలిగించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అధికారులు కోరారు.

March 7, 2026 / 11:22 AM IST

పుల్లారావు పోరాటాలు మరువలేనివి

KMM: అణగారిన వర్గాల కోసం ఎర్రజెండా నీడలో పుల్లారావు చేసిన పోరాటం మరువలేనిదని సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి కొనియాడారు. కమ్యూనిస్టు సిద్ధాంత అమలు కోసం, కార్మిక పోరాటాల కోసం తుదిశ్వాస వరకు శ్రమించిన ధీరుడు మోరంపూడి పుల్లారావు అన్నారు. సత్తుపల్లిలో రావి వీర వెంకయ్య భవనంలో పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు

March 7, 2026 / 11:21 AM IST

డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన పలమనేరు సీఐ

CTR: పలమనేరు పట్టణంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా నాశనం చేస్తాయని తెలిపారు.

March 7, 2026 / 11:21 AM IST

‘మహిళా సాధికారతలో జిల్లాను నంబర్ 1గా నిలుపుదాం’

PPM: మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, మహిళా సాధికారతలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా APNGO, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు.

March 7, 2026 / 11:21 AM IST

వర్నిలో పదిమందిపై పిచ్చికుక్క దాడి

NZB: వర్నిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి పదిమందిపై దాడి చేసి గాయపరిచింది. శనివారం ఉదయం రామాలయం కాలనీలో పిచ్చికుక్క జనాలపై ఎగబడి గాయపరిచింది. రెండు పశువులపై దాడి కూడా చేసిందని స్థానికులు తెలిపారు. ఇటీవల మండల కేంద్రంలో పిచ్చికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. వాటిని నియంత్రించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

March 7, 2026 / 11:20 AM IST