HNK: ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. స్వామివారిని ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
గద్వాల మండలం అనంతపురంలో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కార్తీక్, గోపాల్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. MSPకి చట్టబద్ధత, రుణమాఫీ సాధించే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.
అనంతపురం నగరం గుత్తి రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, సమయపాలనపై ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సరైన మొబైల్ నంబర్లు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ అందేలా అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై నటి, విజయ్ అభిమాని సనమ్ శెట్టి తీవ్రంగా స్పందించింది. వీరిద్దరి వీడియోను షేర్ చేస్తూ.. ‘ఒక భార్య పడుతున్న బాధను పట్టించుకోకపోవడం విచారకరం. అభిమానులను నిరాశపరిచారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సనమ్ శెట్టి చేసిన ఈ ఘాటు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెను దుమారం రేపుతోంది.
KMM: టేకులపల్లి మహిళా ప్రాంగణంలో నిరుపేద మహిళలకు ‘రిటైల్ అండ్ సేల్స్ అసిస్టెంట్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ విజేత తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 18-35 ఏళ్ల లోపు వయస్సు ఉండి పదో తరగతి అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 3 నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. అర్హత కలిగిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

హోలీ రోజు జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ అమ్మాయికి అమె స్నేహితుడు రంగు పూసి బలవంతంగా గంజాయి మత్తుమందు ఇచ్చి.. అడవికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే కొంతమంది అతణ్ని చూసి వెంబడించడంతో.. అమ్మాయిని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత కారులో ఉన్న వ్యక్తులు అమ్మాయిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.
ములుగు జిల్లా కేంద్రంలో శనివారం BRS నియోజకవర్గ ఇంఛార్జ్ నాగజ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టాలున్నా గిరిజన పోడు రైతులను, ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాడ్వాయి (M)కాల్వపల్లిలో గిరిజన రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో కందకాలు తీయడం సరికాదని, ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 96/3 స్కోరుతో తొలి రోజు ఆట ముగించిన ఆసీస్.. ఇంకా 102 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో పెర్రీ(43), అనాబెల్(20) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో హర్మన్ సేన 198 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్ చేయకుండా ప్రత్యర్థిని నిలువరించాలంటే.. ఇవాళ భారత్ ధాటిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసవి రాకముందే ఎండల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మితంగా ఉండేవి కానీ, ఈసారి మధ్యాహ్నం 12 గంటలకే 30 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు రావడానికే ప్రజలు జంకుతున్నారు. వేసవి రాకముందే భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు.
SRPT: మునగాల కస్తూర్బా బాలికల విద్యాలయం విద్యార్థినులు మురుగునీటి సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు. పాఠశాల ప్రహరీ పక్కనే ఉన్న మురుగునీటి బావి నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసనతో విద్యార్థినులు భోజనం కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నారు. నిల్వ ఉన్న నీటితో దోమలు చేరి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

BDK: అన్నపురెడ్డిపల్లి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. రూ. 5,34,196 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారి రమణ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ. 23,000 ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు పాల్గొన్నారు. ఒకే స్టేషన్‌లో 3–5 సంవత్సరాలు పనిచేసిన సిబ్బందికి బదిలీలు చేపట్టారు.