• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్..!

AKP: దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు కశింకోట సీఐ అల్లు స్వామి నాయుడు శుక్రవారం తెలిపారు. 2025 డిసెంబర్‌లో బయ్యవరం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ ఏజెన్సీలో జరిగిన దొంగతనం కేసులో రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా కశింకోట బస్టాప్ వద్ద ముద్దాయి బత్తిన సింహాచలంను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

March 7, 2026 / 10:41 AM IST

తిరుమలలో కేక్ వివాదం.. శ్రీనివాస్, మాధురి వివరణ

AP: తిరుమలలో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్తడే సందర్భంగా కేక్ కట్ చేయడంతో రేగిన వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివరణ ఇచ్చారు. తిరుమలలో కేక్ కట్ చేయకూడదనే విషయం తమకు తెలియదని, తనూజతో తాము ఎగ్‌లెస్ కేక్‌నే కట్ చేయించామని పేర్కొన్నారు. తామే కేక్ తెచ్చామని, ఇందులో తనూజ పాత్ర ఏ మాత్రం లేదని తెలిపారు.

March 7, 2026 / 10:41 AM IST

అనంతపురంలో 100 మంది పోలీసులతో సోదాలు

ATP: అనంతపురంలోని షికారి కాలనీ, బుడ్డప్ప నగర్‌లలో SP జగదీష్ నేతృత్వంలో 100 మంది పోలీసులు భారీ సోదా నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 15 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, దొంగతనాలు వంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

March 7, 2026 / 10:40 AM IST

రోడ్డుపై గుంతలు పూడ్చరూ..

KDM: తోగ్గుడెం పంచాయతీ కేంద్రంలో మణుగూరు – వరంగల్ ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు, ఇసుక లారీల మితిమీరిన రాకపోకల వల్ల రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాలన్నీ మరోవైపు నుంచే వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

March 7, 2026 / 10:40 AM IST

ఉట్నూర్ ఐటీడీఏ పీవీటీజీ ఏపీఓగా భాస్కర్

ADB: ఉట్నూర్ ఐటీడీఏలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పీవీటీజీ ఏపీఓ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది. ఈ పదవికి ఆత్రం భాస్కర్‌ను నియమిస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలోనూ ఇదే పోస్టులో పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రభుత్వం ఆయనకే మొగ్గు చూపింది. ఐటీడీఏ పీఓ సారథ్యంలో పీవీటీజీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

March 7, 2026 / 10:39 AM IST

‘వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి’

PPM: జిల్లాలో అభివృద్ధి పనుల్లో వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రగతి కుంటుపడిన చోట క్షేత్రస్థాయి అధికారులు స్వయంగా పర్యటించి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ సర్వేలను వేగవంతం చెయ్యాలి అన్నారు.

March 7, 2026 / 10:39 AM IST

HYD తెలుగువర్శిటీలో జ్యోతిష ఝరి

HYD తెలుగు విశ్వవిద్యాలయం NTR ఆడిటోరియంలో నిర్వహించిన రసఝరి కార్యక్రమంలో వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యతను వివరించారు. ఖగోళ గ్రహాల గమనాలపై నిషిత అధ్యయనం, ఖచ్చితమైన కాలనిర్ణయంతో జ్యోతిష్య శాస్త్రీయ ప్రమాణంతో ఉండాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన శతదిన విద్య ప్రణాళికలో భాగంగా జరిగింది.

March 7, 2026 / 10:38 AM IST

అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు: కలెక్టర్

చిత్తూరు జిల్లాలో గుర్తింపు లేని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఆసుపత్రుల, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, డెంటల్ ఆస్పత్రులు వారం రోజుల్లోగా అవసరమైన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.

March 7, 2026 / 10:38 AM IST

సంతనూతలపాడులో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: సంతనూతలపాడు ఎండ్లూరు డొంక వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగం దెబ్బ తింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 10:38 AM IST

పొలం గొడవలో దాడి.. దంపతులకు రిమాండ్..!

అన్నమయ్య: కె.వి పల్లి మండలం, వడ్లకుంట పంచాయతీ సుబ్బాలవారి పల్లిలో పొలం గొడవలో పూజారి నాగులపై, మల్లెల జయన్న (63), భార్య సుబ్బమ్మ (55) కొడవలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను పీలేరు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయం కె.వి పల్లి ఎస్సై బి. వెంకట శివకుమార్ తెలిపారు.

March 7, 2026 / 10:37 AM IST

మొక్కజొన్న కొనుగోలు బకాయిల నిధులు విడుదల

KMR: వానకాలం 2025-26 సీజన్‌కు సంబంధించిన జిల్లాలో మార్క్‌పెడ్ ద్వారా వివిధ కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన మొక్కజొన్న రైతుల బకాయిలు 63.19 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలు తెలిపారు. దీనికి సంబంధించిన నిధులు నేటి నుంచి రైతుల వారి వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

March 7, 2026 / 10:34 AM IST

కోట క్రాస్ రోడ్డులో లారీల చట్రం.. ప్రయాణికులకు ఇబ్బందులు

TPT: కోట మండల కేంద్రంలోని కోట క్రాస్ రోడ్డులో వే బ్రిడ్జి వద్ద లారీల పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. వే బ్రిడ్జికి వచ్చే లారీలు డ్రైవర్లు రోడ్డుపైనే అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

March 7, 2026 / 10:33 AM IST

10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ASR: కొయ్యూరు మండలం నిమ్మలగొంది, పారికలు గ్రామాల్లో ఇవాళ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని సీఐ బీ.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించామన్నారు. రికార్డులు సక్రమంగా లేని 10 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు.

March 7, 2026 / 10:33 AM IST

లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సీఎం రేవంత్ ఎదుట మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టుల సరెండర్ ను పోలీసులు చూపెట్టనున్నారు. దేవ్ జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానుంది. 

March 7, 2026 / 10:33 AM IST

జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు

కడప: జిల్లాలో పలుచోట్ల ఇవాళ తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎర్రగుంట్లలోని ప్రకాశ్ నగర్‌లో ప్రతి ఇంటిని పరిశీలించి పత్రాలు లేని 23 బైకులు, 2 ఆటోలను సీజ్ చేశారు. పులివెందులలో 60 మంది పోలీసులతో తనిఖీలు చేసి 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.

March 7, 2026 / 10:33 AM IST