• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భారత్‌తో ఫైనల్.. న్యూజిలాండ్ బలాలివే!

తొలి T20 WC ట్రోఫీ కోసం న్యూజిలాండ్ రేపు భారత్‌తో తలపడనుంది. INDతో T20ల్లో 18-11తో వెనకబడినా.. T20 WCలో తలపడిన 3 సందర్భాల్లోనూ ఆ జట్టుదే విజయం. పైగా కెప్టెన్ శాంట్నర్, రచిన్, సోధితో IND కంటే బలమైన స్పిన్ అటాక్ కివీస్ సొంతం. టోర్నీలో IND బ్యాటింగ్ సగటు 27.31 అయితే NZది 41.68. ఇంకా IND ప్లేయర్లు 11 సార్లు డకౌట్ కాగా NZ బ్యాటర్లు 2 సార్లే అలా వెనుదిరిగారు.

March 7, 2026 / 11:19 AM IST

విజయవాడలో కాల్పుల కలకలం

AP: డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ‘వజ్ర ప్రహార్’ పేరిట ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడలో అధికారులపై కొందరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 11:19 AM IST

ఈనెల 11న గాజులగూడెంలో ఇసుక వేలం

MDK: పాపన్నపేట మండలం గాజులగూడెం గ్రామంలో ఈనెల 11న ఇసుక వేలం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సతీశ్ తెలిపారు. గత నెల 26న మంజీరా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 834 క్యూబిక్ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మైనింగ్ అధికారుల సూచనల మేరకు ఆ ఇసుకను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 11:16 AM IST

ఆత్మకూరు-వనపర్తి బస్సులు యథాతథం

WNP: మదనాపురం రైల్వే గేట్ పనుల వల్ల బస్సులు నిలుపుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, శనివారం ఆత్మకూరు వనపర్తి మధ్య బస్సులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. గేటు వద్ద పనులు మొదలైనప్పుడే రాకపోకలు నిలిపివేస్తామని, ఈరోజు మధ్యాహ్నం వరకు బస్సులు తిరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి.

March 7, 2026 / 11:13 AM IST

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ఖుష్బూ?

జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు మలయాళ నటుడు టొవినో థామస్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

March 7, 2026 / 11:12 AM IST

ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

NGKL: వంగూర్ మండలం అన్నారం, సర్వారెడ్డి పల్లి తండా గ్రామాల్లో శనివారం ఎంపీడీవో బ్రహ్మచారి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం కూలీలతో సమావేశమై.. ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

March 7, 2026 / 11:09 AM IST

కాల్వ గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం

NRML: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శనివారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రోజాను ఘనంగా సత్కరించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సూచించారు. ఎంపిఓ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 11:09 AM IST

వృద్ధురాలి మిస్సింగ్ కేసు నమోదు

KNR: శంకరపట్నం (M)లోని చర్లపల్లికి చెందిన సంబు వెంకవ్వ (55) అనే వృద్ధురాలు శుక్రవారం అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో కుమారుడు రమేశ్ కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద ఆమె చేతికర్ర ఆనవాళ్లు లభించాయి. (8712670774), కుటుంబ సభ్యులను (8688262143) సంప్రదించాలని కోరారు.

March 7, 2026 / 11:07 AM IST

ఉస్మానియా హాస్టల్స్ పనుల ప్రారంభం ఎప్పుడో..?

HYD ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిగా శిథిలావస్థకు చేరిన హాస్టళ్ల స్థానంలో నూతన హాస్టల్స్ నిర్మిస్తామని, ఓయును అద్భుతంగా మారుస్తామని ఉస్మానియా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చారు. నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం రంగం సిద్ధం చేసినట్లు గత మూడు నెలల క్రితమే తెలిపారు. కానీ.. చర్యలు కనిపించడం లేదని విద్యార్థులన్నారు.

March 7, 2026 / 11:06 AM IST

చెరుకుపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

BPT: చెరుకుపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ సింగ్ (24) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. బతుకుతెరువు కోసం వచ్చిన యువకుడు, వివాహమైన నాలుగు నెలలకే మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 11:06 AM IST

‘ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం వెంటనే చేపట్టాలి’

SKLM: సోంపేట మండలం బారువా గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి పనులు పూర్తి చేయాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామంలో పర్యటించిన వైసీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తిచేసిన కూటమి మిగిలిన పనులను పూర్తి చేయకుండా జాప్యం చేస్తుందని ఎద్దేవా చేశారు, రోగులకు వైద్య వసతులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

March 7, 2026 / 11:05 AM IST

పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నాగిరెడ్డిపేట(M) పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం శనివారం ఔట్ ఫ్‌లో 208 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా, 30 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.575 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

March 7, 2026 / 11:05 AM IST

పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి భూమిపూజ

ADB: ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం, పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు.

March 7, 2026 / 11:03 AM IST

విషాదం.. పాము కాటుతో వ్యక్తి మృతి

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన గూడెల్లి నారాయణ (52) మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో పని చేస్తున్న ప్రదేశంలో పాము కాటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం అస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

March 7, 2026 / 11:00 AM IST

వైభవంగా మూక పంచశతి పారాయణం

NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో సౌందర్యలహరి మూక పంచశతి పారాయణం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి ఆమెకు స్వాగతం పలికారు. సౌందర్యలహరి మూక పంచశతి పారాయణం ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

March 7, 2026 / 11:00 AM IST