BPT: చెరుకుపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ సింగ్ (24) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. బతుకుతెరువు కోసం వచ్చిన యువకుడు, వివాహమైన నాలుగు నెలలకే మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.