KMR: నాగిరెడ్డిపేట(M) పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం శనివారం ఔట్ ఫ్లో 208 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా, 30 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.575 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.