AP: పోలవరం ఎడమ, వెలిగొండ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించారు. టన్నెల్ పనుల జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే వంతెనలు, టన్నెల్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. గోదావరి జలాలు సీజన్‌కి ముందే అనకాపల్లి చేరాలని అన్నారు. జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. త్వరలో నిర్వాసితులకు పునరావాస పరిహారం ప్రకటిస్తామని వెల్లడించారు.