NGKL: ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, DSO రేవంత్ చంద్రలతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీకి సూచించారు.