KMR: జిల్లాలో 2025లో 10,90,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 1,324 టీబీ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నమోదైన కేసులలో 94% మందికి వ్యాధి నయమైనట్లు అధికారులు తెలిపారు. నిక్షయ్ పోషణ యోజన పథకం కింద ప్రతి టీబీ రోగికి నెలకు రూ.1000 (DBT) అందిస్తున్నారు. కామారెడ్డి, జుక్కల్ ప్రాంతాలలో ఈ పరీక్షలు జరిగాయి.