TG: ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవి రెన్యూవల్ అయిన సందర్భంగా పార్టీ ముఖ్య నేతలకు సింఘ్వీ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. ఈ విందు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.