ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో మంగళవారం రాత్రి ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నైట్ బీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను విచారించి వారి వివరాలను సేకరించినట్లు ఎస్ఐ తెలిపారు. రాత్రి వేళల్లో నేరాలను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.