AP: ఆర్డీటీకి FCRA అనుమతుల పునరుద్ధరణపై మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి ఇది మేలు చేస్తుందన్నారు. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు ‘క్రెడిట్ చోరీ’ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా బాబు కృషి ఉంటే ఏడాది ఎందుకు పట్టిందని, వైఎస్సార్సీపీ పోరాటం వల్లే ఇది సాధ్యమైందని జగన్ పోస్ట్ చేశారు.