NLG: మర్రిగూడ మండలంలోని పలు చికెన్ సెంటర్లు, హోటళ్లలో సివిల్ సప్లై అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న 40 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్నట్లు సివిల్ సప్లయ్ ఓఎస్ఓ అంజయ్య తెలిపారు. పట్టుబడిన సిలిండర్లను మండల కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ గోదాంలో అప్పగించినట్లు వెల్లడించారు.