AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కర్నూలు సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడొచ్చు. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.