MBNR: ‘రైతుభరోసా’ పథకం డబ్బులు పొందాలంటే దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ అని పెద్దవార్వాల్ AEVO శివలీల తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్త పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతు భరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేయాలి. అప్లికేషన్‌తో పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.