తెలుగు రాష్ట్రాలలో 5 ఏళ్లలో 1,304 మంది మహిళలు వరకట్న వేధింపులతో మరణించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. TDP MP బైరెడ్డి శబరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 వరకు APలో 526, TGలో 778 కేసులు నమోదయ్యాయి. శిక్షల ఖరారు రేటు APలో 11.5%, TGలో 14.4%గా ఉంది. వరకట్న మరణాల్లో UP, బీహార్ టాప్లో ఉన్నాయి.