సాయుధ దళాల్లో పనిచేస్తున్న మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు కూడా శాశ్వత కమిషన్కు (పర్మినెంట్ హోదా) అర్హులని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. మెరిట్, వైద్య ప్రమాణాల ఆధారంగా దీన్ని అమలు చేయాలని స్పష్టంచేసింది. వారిని నిరాకరించడం వివక్ష కిందికే వస్తుందని పేర్కొంది. ఈ తీర్పుతో 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న మహిళలకు పెన్షన్, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.