ADB: ఉట్నూర్ మండలం దంతన్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం పరిశీలించారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను, లబ్ధిదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రఘునాథ్, ఎంపీడీవో రామ్ ప్రసాద్, ఏఈలు, గ్రామస్థులు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.