VKB: వికారాబాద్లో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న సౌకర్యాలను పునరుద్ధరించాలని జిల్లా అధ్యక్షుడు మాణిక్ ప్రభు ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం సరికాదన్ని తెలిపారు.