ATP: గుత్తి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా బుధవారం అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి గుత్తా కేశవ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా స్పెషల్ ఆఫీసర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం 2026 మార్చి 17తో ముగియడంతో, ఆ స్థానంలో ప్రత్యేక అధికారులు పరిపాలన బాధ్యతలను నిర్వహించనున్నారు.