W.G: పాలకొల్లు మన్యం జగ్గమ్మ గారి సత్రం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కర్నేన రోజారమణి, పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.