TG: రాష్ట్రంలో ఫ్రూట్, ఫ్లేవర్డ్ బీర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం గతంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. వీటి ద్వారా నెలకు రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. హైదరాబాద్లో 100, ఇతర నగరాల్లో 20 పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుదారులకు అవసరమైన సాంకేతిక అర్హతలు లేకపోవడంతో ప్రభుత్వం ఆ టెండర్లను తిరస్కరించింది.