PPM: జిల్లాలో డ్రగ్స్, గంజాయి వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని, గ్రామస్థాయిలో ప్రత్యేక అవగాహన డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. అలాగే రహదారి భద్రత, హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్యపరచాలని అన్నారు.