కోనసీమ: పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, గంటి పెదపూడి లంక, వై వి పాలెంలలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణాలను అరికట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతికి వైసీపీ పి. గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. మండల వైసీపీ నాయకులతో కలిసి ఆయన అక్రమ రవాణా వివరాలను జేసీకి తెలియజేసి వినతిపత్రం అందజేశారు.