ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్(PM-SYM) యోజన అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 హామీ పెన్షన్ కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం. 18-40 ఏళ్ల వయస్సు ఉండి, నెలకు రూ.15,000 లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు. వయస్సును బట్టి నెలకు రూ.55-రూ.200 చెల్లించాలి. ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంకు ఖాతా లేదా జన్‌ధన్ ఖాతాతో సమీపంలోని CSC సెంటర్లో నమోదు చేసుకోవచ్చు.