హీరోయిన్ శృతి హాసన్ తన పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కన్ సల్మాన్ గురించి తెలిపారు. దుల్కన్ తాను బాల్యంలో చెన్నైలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. ఆ సమయంలో తరచూ కలుసుకునేవారమని పేర్కొన్నారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. కాగా తాజాగా దుల్కర్‌తో కలిసి ఆమె ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.