TG: డీలిమిటేషన్, 50% పార్లమెంట్ స్థానాల పెంపునకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. ‘ఇదంతా ఏ లెక్కన జరుగుతోంది? ఇదే జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలతో పనిలేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఫలితంగా దక్షిణాది అవసరం లేకుండా పోయి, తీవ్ర నష్టం జరుగుతుంది. అన్నింటా చర్చించి ముందుకు వెళ్లాలి’ అని పేర్కొన్నారు.