TG: డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాదికి వ్యతిరేకం కాదని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా విభజించేలా మాట్లాడకూడదని అన్నారు. కేంద్రం ఇంకా ఎలాంటి పాలసీ ప్రకటించలేదన్నారు. సీఎం ఊహించుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.