KMM: ఏన్కూరు మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 11మంది విద్యార్థులు ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష రాయగా అందరూ వివిధ గురుకుల విద్యాలయాల్లో సీట్లు సాధించి 100% ఫలితాలను నమోదు చేశారు. ఒకే పాఠశాల నుంచి ఇంతమంది విద్యార్థులు ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.