NRPT: మక్తల్ పట్టణంలో సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీహరి సతీమణి లలిత ఈరోజు సందర్శించారు. కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందుతున్న మహిళలకు స్టడీ మెటీరియల్ను వారికి అందజేశారు. కుట్టు మిషన్లో శిక్షణ పొందుతున్న యువతులకు మెలకువలను నేర్పించారు. శిక్షణ పొందుతున్న వారి దగ్గరికెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.