AP: పర్యాటక శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటకశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన పర్యాటక ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా, శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.