E,G: రంగంపేట మండలం చిన్న దొడ్డిగుంటలో మంచినీటి సమస్య పరిష్కారం కానుంది. అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో బోర్వెల్ యూనిట్ మంజూరైంది. బుధవారం రంగంపేట మండల తెలుగు యువత అధ్యక్షుడు వెలమర్తి సుధాకర్ చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కొండేపూడి నాని, సూర్య భాస్కర రావు, త్రిమూర్తులు, బత్తుల శ్రీను, వరప్రసాద్ పాల్గొన్నారు.