KMM: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఏదులాపురం 8వ వార్డు కౌన్సిలర్ సుశీలమ్మ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం 8వ వార్డులో సమగ్ర బాలల హక్కుల, పరిరక్షణ బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయని చెప్పారు. హక్కులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.